Header Banner

స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో వెళ్లొచ్చు! ఈ ఆప్షన్ తెలిస్తే చాలు!

  Thu Feb 27, 2025 15:55        Travel

రైలులో ప్రయాణించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయాలనుకునే వారు, పిల్లలు, వృద్దులతో జర్నీ చేసే వారికి ట్రైన్ జర్నీ సేఫ్‌గా భావిస్తారు. అందుకే ప్రయాణానికి ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటారు. అయితే ట్రైన్‌లో కూడా తరగతుల వారిగా టికెట్లు, బెర్త్‌లు ఉంటాయి. కాస్త డబ్బు ఎక్కువైన పర్వాలేదు అనుకునే వారు ఏసీ కోచ్‌లోని ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్‌ టికెట్స్ తీసుకొని ఈ బోగీల్లో ప్రయాణించడం అందరికి తెలుసు. కాని సాధారణ రిజర్వేశషన్‌తో స్లీపర్ క్లాస్ టికెట్ తీసుకొని థర్డ్ ఏసీలో ప్రయాణించవచ్చనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 

 

దేశంలోనే అతి రవాణా వ్యవస్థ అయిన రైల్వే ప్రయాణికులకు ఈతరహా సౌకర్యాన్ని అదనంగా డబ్బులు చెల్లించకుండా ప్రయాణించవచ్చని చెబుతోంది. స్లీపర్ క్లాస్ టికెట్‌ తీసుకొని ఏసీ కోచ్‌లో ప్రయాణించాలంటే ఏం చేయాలనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి.ఈ విధానానికి సంబంధించి కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. అన్ని సందర్భాల్లో ఈ విధమైన సదుపాయం అందుబాటులో ఉండదు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు చాలా వరకు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు స్లీపర్ క్లాస్ టికెట్‌ కొనుగోలు చేస్తుంటారు. జనరల్ క్యాటగిరిలోనే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటారు. అయితే స్లీపర్ టికెట్ తీసుకొని థర్డ్ ఏసీలో ప్రయాణించడానికి ఈ ఆప్షన్‌ తప్పకుండా అప్లై చేయాలి ప్రయాణికులు. 

 

ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ముందుగా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకుడికి ఒక కోచ్‌లో బెర్తు కేటాయించిన తర్వాత ఆటో అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో తనకు ఏసీ కోచ్‌లో బెర్తు కేటాయిస్తే.. ముందుగా తనకు కేటాయించిన బెర్తును వేరే ప్రయాణికుడికి కేటాయించే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో చార్ట్ తయారైన తర్వాత మన పిఎన్‌ఆర్ నెంబర్ ద్వారా మనకు కేటాయించిన బెర్తు లేదా సీటు వివరాలు తెలుసుకోవచ్చు. సాధారణంగా ఈ ఆటో అప్‌గ్రేడేషన్ ప్రక్రియ స్లీపర్ క్లాస్ నుంచి థర్డ్ ఏసీ, ధర్డ్ ఏసీ నుంచి సెంకండ్ ఏసీ వరకు ఉంటుంది. స్లీపర్ క్లాస్‌లో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువుగా ఉండి, చార్ట్ తయారీ సమయానికి ఏసీ క్లాస్‌లో బెర్తులు ఖాళీగా ఉంటే.. ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంచుకున్న ప్రయాణీకులకు స్లీపర్ నుంచి ఏసీ తరతగతిలో బెర్తు కేటాయిస్తారు. 

 

దీని ద్వారా స్లీపర్ క్లాస్‌లో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకులకు బెర్తు లేదా సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది.ఈ ఆటో అప్‌గ్రేడ్ కోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. చార్ట్ ప్రిపరేషన్ సమయంలో ఆటోమేటిక్‌గా ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే స్లీపర్ టికెట్‌పై ఏసీ కోచ్‌లో ప్రయాణించే ఈ సౌకర్యం అందరికి ఉండదు. ఈ ఆటో అప్‌గ్రేడేషన్ కోసం కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఆటో అప్‌గ్రేడేషన్ అనే ఆప్షన్‌ను ఎంచుకున్న వారే దీనికి అర్హులు. అదే సమయంలో టికెట్‌ పూర్తి రుసుము చెల్లించే ప్రయాణికులు మాత్రమే ఆటో అప్‌గ్రేడేషన్‌కు ఫెసిలిటీ ఉంటుంది. రాయితీ టికెట్లకు ఇది వర్తించదు. సీనియర్ సిటిజన్, మహిళలు ఇలా ప్రత్యేకమైన కోటా ద్వారా రాయితీలు పొందితే వారికి ఈ విధానం వర్తించదు. భారతీయ రైల్వే నిర్ణయించిన మేరకు పూర్తిస్థాయి రుసుము చెల్లిస్తే ఆటో అప్‌గ్రేడేషన్ ప్రక్రియ ద్వారా బెర్తు, సీటు పొందేందుకు అవకాశం ఉంటుంది.

 

ఇది కూడా చదవండి
వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!  

 

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు! 

 

గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!  

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!  

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Travel #Trains #TrainTravel #GoaTravel #GoaVibes #GoaIsOn #Secundrabad #SpecialTrainToGoa #Vascodagama